Chandrababu: చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలన్న పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ
ABN, Publish Date - Aug 14 , 2024 | 01:01 PM
సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు.
అమరావతి: సీఎం చంద్రబాబుపై ఉన్న 7 కేసులను సీబీఐకు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. పిటిషన్ విచారణ అర్హతపై అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం లేవనెత్తారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పారు. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉన్నారని సీబీఐ విచారణకు ఆదేశించడం సబబు కాదని ముకుల్ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికే ఇందులో ఐదు కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులు సమీక్షిస్తామని ప్రభుత్వం చెప్పిందని సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు.
ప్రభుత్వం సమీక్షిస్తామన్నా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వాయిదా వేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 22 కేసులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే కేసుల పర్వాన్ని మొదలు పెట్టారు. చంద్రబాబుపై 2020 నుంచే కేసుల పర్వం ప్రారంరభమైంది. 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టడం జరిగింది. ఇక వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.
కాదేదీ కేసులకు కారణం అనర్హం అన్నట్టుగా చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయంపై కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టే యత్నం చేశారు. చివరకు ఉచిత ఇసుక పాలసీ కారణంగా రాష్ట్ర ఖజానాకు గండి పడిందని కూడా కేసు పెట్టారు. సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్‌ప్లాన్ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. ఇవి చాలవన్నట్టుగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఏపీ ఫైబర్‌నెట్, ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసుల్లో ఏడింటిని సీబీఐకు అప్పగించాలంటూ మరో కేసుపై విచారణ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్
Steel Plant: స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యక్ష పోరాటం.. షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 14 , 2024 | 01:01 PM