ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ భారీగా వరద

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:13 AM

ప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీన ప్రకాశం బ్యారేజ్‌కి రికార్డు స్థాయిలు 11.47లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 40 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతూనే ఉంది.

ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు రాక

సముద్రంలోకి 77,750 క్యూసెక్కులు

విజయవాడ/చిట్టినగర్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):

ప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ నుంచి 84,297 క్యూసెక్కుల నీరు వస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీన ప్రకాశం బ్యారేజ్‌కి రికార్డు స్థాయిలు 11.47లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 40 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కసారిగా ఇది మరింతగా పెరిగింది. పులిచింతల నుంచి 84,237 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజ్‌ 40 గేట్లను రెండు అడుగులు, 30 గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి 77,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కేఈ మెయిన్‌ కెనాల్‌కు 4,028, కేడబ్ల్యూకి 2,519, కాల్వలకు 6,547 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

వరద ప్రవాహం పెరగడంతో వీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వరద సంబంధిత ఫిర్యాదుల కోసం వీఎంసీలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కమిషనర్‌ ధ్యానచంద్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పెరుగుతున్న వరదల నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Updated Date - Oct 20 , 2024 | 01:14 AM