Share News

అంతర్జాతీయ స్థాయికి జగన్‌ అవినీతి

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:52 AM

నిన్నటి వరకూ రాష్ట్ర, దేశ సరిహద్దు లు దాటని మాజీ సీఎం జగన్‌ అవినీతి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని కూటమి ఎమ్మెల్యేలు విమర్శించారు.

అంతర్జాతీయ స్థాయికి జగన్‌ అవినీతి

ఆయనతో పోలిస్తే ఎస్కోబార్‌ బాధపడతాడు: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకూ రాష్ట్ర, దేశ సరిహద్దు లు దాటని మాజీ సీఎం జగన్‌ అవినీతి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని కూటమి ఎమ్మెల్యేలు విమర్శించారు. జగన్‌కు అదానీ లంచం ఇచ్చారంటూ అమెరికాలో నమోదైన కేసుపై సభలో ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ‘జగన్‌ రాష్ర్టాన్ని దోచేశారు. ఎక్కడో అమెరికాలో ఆయనపై కేసు నమోదైతే అందరూ నాకు ఫోన్‌ చేస్తున్నారు. జగన్‌తో మీకు స్నేహం ఉందా? అని అడుగుతున్నారు. జగన్‌ దురాగతాలపై అందరూ మౌనం వీడాలి. జగన్‌ అవినీతిపై విచారణకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి’ అన్నారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు రూ.1,750 కోట్లు పెద్ద విషయం కాదని ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాలేని పిరికి సన్నాసి జగన్‌ అని మండిపడ్డారు. ఓవైపు దేశంలో సీబీఐ, అమెరికాలో ఎఫ్‌బీఐ అభియోగాలు నమోదు చేసినా ఇంకా నిస్సిగ్గుగా జగన్‌ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడు తూ, ‘గతంలో జగన్‌తో కలిసి పనిచేసినందుకు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వైసీపీలో పనిచేసినందుకు తెలుగు జాతికి క్షమాపణలు చెపుతున్నా’ అని అన్నారు. జగన్‌తో పోలికపెడితే అంతర్జాతీయ స్మగ్లర్‌ ప్యాబ్లో ఎస్కోబార్‌ కూడా బాధపడతాడని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 04:52 AM