ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైసీపీకి వరుస షాక్‌లు.. కీలక నేత రాజీనామా..

ABN, Publish Date - Feb 24 , 2024 | 09:05 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి(YSRCP) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ అసంతృప్త నేతలు. ప్రభుత్వ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా కీలక మంత్రి సోదరుడే పార్టీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతల. మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram) సోదరుడు నారాయణ..

Minister Gummanur Jayaram Brother Narayana

కడప/కర్నూలు, ఫిబ్రవరి 24: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి(YSRCP) వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ అసంతృప్త నేతలు. ప్రభుత్వ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా కీలక మంత్రి సోదరుడే పార్టీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరులో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతల. మంత్రి గుమ్మనూర్ జయరాం(Minister Gummanur Jayaram) సోదరుడు నారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని నారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సొంత జిల్లాలోనూ అదే పరిస్థితి..

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ నేత సురేష్ నాయుడు వారందరినీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రొద్దుటూరు 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, ఆయన అనుచరులు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వైసీపీలో విలువలు లేకపోవడంతోనే టీడీపీలో చేరామని కౌన్సిలర్ మునీర్ అన్నారు. కాగా, ఎమ్మెల్యే రాచమల్లుకు దూరంగా ఉంటూ వస్తున్న కౌన్సిరల్ మునిర్‌ చివరకు వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2024 | 09:05 PM

Advertising
Advertising