Gudivada: ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ని ఎదుర్కోలేరు: కొడాలి నాని
ABN , Publish Date - Feb 20 , 2024 | 06:11 PM
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని సీఎం జగన్‌ని ఢీ కొట్టాలని చూసినా నిరూపయోగమేనని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్‌కు కొడాలి కౌంటర్ ఇచ్చారు.
గుడివాడ: రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని సీఎం జగన్‌ని ఢీ కొట్టాలని చూసినా నిరూపయోగమేనని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani)అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్‌కు కొడాలి కౌంటర్ ఇచ్చారు.
కృష్ణా జిల్లా గుడివాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "సీఎం జగన్ చాలా క్లారిటీతో ఎన్నికలకు వెళ్తున్నారు. మంచి జరిగితే మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడకుండా.. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు విసురుతున్నారు. 14 ఏళ్లు బాబు అధికారంలో ఉన్నప్పటికంటే.. జగన్ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. వీటిపై చర్చకు సిద్ధమా. సీఎంగా ఎవరుండాలో నిర్ణయించేది ప్రజలే. తనలా మాజీలుగా ఉన్న వారితో బాబు ఛాలెంజ్‌లు చేసుకోవాలి. ప్రజలెన్నుకున్న నేతలతో కాదు. మూడు పార్టీలతో కలిసి వస్తున్న బాబుది జగన్‌ని ఎదుర్కోలేని స్థాయి" అని నాని అన్నారు.