Share News

YS Sharmila అప్పట్లో చంద్రబాబు ఏడ్చినంత పనిచేశారు.. మరి ఇప్పుడేంటి ఇలా

ABN , Publish Date - Nov 06 , 2024 | 12:21 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రజలు ఏం పాపం చేశారు.. మీకు ఓట్లు వేసి గెలిపించడమే పాపమా’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారని... 35వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు ఏడ్చినంత పని చేశారన్నారు.

YS Sharmila  అప్పట్లో చంద్రబాబు ఏడ్చినంత పనిచేశారు.. మరి ఇప్పుడేంటి ఇలా
APCC Chief YS Sharmila Reddy

విజయవాడ, నవంబర్ 6: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం విజయవాడలో ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి (APCC Chief YS Sharmila Reddy) పాల్గొన్నారు. లాంతర్లు చేతపట్టి వినూత్న రీతిలో నిరసనకు దిగారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచిన కరెంటు బిల్లులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నందుకు నిరసనగా ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. ఐదు నెలల పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇది హై ఓల్టేజీ షాక్ కాకపోతే ఏమిటి అని ప్రశ్నించారు. ఈనెల నుంచి ఆరు వేల కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు.

US Election Results: అమెరికా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఇవే



మిమ్మల్ని గెలిపించడమే పాపమా

మరో 11 వేల కోట్ల రూపాయల భారం కూడా త్వరలోనే ప్రజలపై మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 17 వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరుతో వసూలు చేయబోతున్నారన్నారు. ‘‘ప్రజలు ఏం పాపం చేశారు.. మీకు ఓట్లు వేసి గెలిపించడమే పాపమా’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారని... 35వేల కోట్ల భారం మోపారని చంద్రబాబు ఏడ్చినంత పని చేశారన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఈ భారాలు ఉండేవి కాదని, 30 శాతం ఛార్జీలు తగ్గించే వాళ్లమని నాడు చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు.. నాలుగు నెలల్లోనే 17వేల కోట్ల భారం ప్రజలపై ఎలా మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘నాలుగు రూపాయలకు కొనాల్సిన కరెంటును 9 రూపాయలకు జగన్ కొన్నారని మీరే చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తే.. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఆ ప్రభుత్వం తప్పులు చేస్తే.. విచారించి వారిని శిక్షించాలే గానీ, ప్రజలపై భారాలు మోపడం ఏమిటి. నిత్యావసర వస్తువులు పెరిగాయి. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితులలో ప్రజలపై ఇన్ని వేల కోట్లు భారం మోపడం తగునా. పదేళ్లుగా మన ఎంపీలు అందరూ బీజేపీకే ఊడిగం చేస్తున్నారు. మరి ఏపీ ప్రజలకు కష్టం వస్తే.. బీజేపీ ఎందుకు ఆదుకోవడం లేదు. సెంట్రల్ ఈ.ఆర్.సీ మీ చేతుల్లోనే ఉంది కదా.. విద్యుత్ భారాలు లేకుండా చేయలేరా. ప్రత్యేక హోదా నుంచి అన్ని వెన్నుపోట్లే... అన్నీ మోసాలే బీజేపీ చేసింది. ఇప్పుడు 17 వేల కోట్ల భారం ప్రజలపై పడుతుంటే.. బీజేపీ ఏం చేస్తోంది. ఇంత అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని నిలదీయరు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను రోల్ బ్యాక్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. ఆరు వేల కోట్ల రూపాయల విద్యుత్ వసూళ్లకు ఈ.ఆర్.సి కి చంద్రబాబు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయాలను మొత్తం చంద్రబాబు ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.


వైసీపీ తప్పు చేస్తే.. శిక్ష ప్రజలకా

సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఒక చేత్తో ఇస్తున్నారు.. మరో చేతితో తీసుకుంటున్నారన్నారు. ‘‘మీరు ఇస్తుంది పావల అయితే.. ప్రజల నుంచి మీరు వసూలు చేస్తుంది రూపాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే.. ఏపీ ఎంపీలే కారణం. కాబట్టి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపకుండా చంద్రబాబు బాధ్యత తీసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే.. ప్రజలు వారికి బుద్ది చెప్పారు. 35 వేల కోట్ల భారాన్ని జగన్ ప్రజలపై మోపారు. ఇఫ్పుడు చంద్రబాబు ఇదే తప్పు చేస్తే.. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఇంత భారం మోపడం అన్యాయం కాదా. తప్పు చేసింది గత వైసీపీ ప్రభుత్వం అయితే.. శిక్ష ప్రజలకా. ఈ విషయంలో కేంద్రంతో చంద్రబాబు చర్చలు చేసి.. భారం లేకుండా చూడాలి’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ ధర్నాలో షర్మిలతో పాటు మస్తాన్ వలీ, జెడీ శీలం, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Aghori: పిఠాపురంలో మహిళా అఘోరి కలకలం..

Purandeshwari: కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి ప్రస్తావించిన అంశాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 12:22 PM