చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: రావి వెంకటేశ్వరరావు
ABN, Publish Date - Nov 23 , 2024 | 01:21 AM
గురునానక్ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణమండపంలో ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రావి వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు తీసుకున్నారు.
ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
వన్‌టౌన్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘ఇరవై నాలుగేళ్ల రాజ కీయ జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్నా, కష్టాలు చూశా. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని నిల బెట్టుకుంటా. రైతులకు మేలు చేసేలా పనిచేస్తా. గిడ్డంగుల నిర్మాణా నికి కృషి చేస్తా. ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేస్తా.’ అని రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణమండపంలో ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నారు. పలువురు మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఎన్ని ఒడిదొ డుకులు ఎదురైనా గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేయటంలో రావి చేసిన కృషి మరువలేనిదని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. రైతు లకు మేలు చేసేలా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. టీడీపీకి రావి కుటుంబం చేసిన సేవ ఎనలేని దని టీడీపీ జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. రావి వెంకటే శ్వరరావును పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఎంపీలు కేశి నేని చిన్ని, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, వెని గండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, బూరగడ్డ వేదవ్యాస్, సామినేని ఉదయభాను, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, నాగుల్‌మీరా, బీజేపీ నాయకుడు దావులూరి సురేంద్రబాబు పాల్గొన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 01:21 AM