ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: భారీ వర్షాల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం

ABN, Publish Date - Sep 01 , 2024 | 06:53 PM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటుకు దగ్గరనే బస చేయాలని ఆయన నిర్ణయించారు. వరదల పరిస్థితిపై గంట గంటకు స్వయంగా సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు. వరద సహాయక చర్యల విషయంలో కొంత నిర్లక్ష్యం జరిగిందని, అందుకే కలెక్టర్ కార్యాలయంలో ఉండి సమీక్షిస్తానని ఆయన చెప్పారు.


ఇక తక్షణమే ఆహార సరఫరా పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఇది ఊహించని విపత్తు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయక చర్యలు అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బోట్ల ద్వారా వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తున్నామని వెల్లడించారు. సహాయక చర్యలను మంత్రులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని, వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆయన చెప్పారు.


కాగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఉన్నత అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. తక్షణం విజయవాడ నగరంలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో అన్నింటినీ కొనుగోలు చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. తక్షణం వాటిని ఇంటింటికీ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మంచి నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచన చేశారు.


ఈ రాత్రి కలెక్టర్ కార్యాలయంలోనే మకాం

విజయవాడలోని కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు ఈ రోజు రాత్రికి మకాం చేయనునున్నారు. బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద పీడిత ప్రాంతాల ప్రజానీకాన్ని ఆదుకునే వరకు అక్కడే ఉండాలని సీఎం నిర్ణయించుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను పిలిపించి చంద్రబాబు మాట్లాడనున్నారు. ఎక్కడికక్కడే దుకాణాలు తెరిపించి క్యాండిల్స్, వాటర్ బాటిల్స్, పాలు, ఆహారం, ఇతర సదుపాయాలు కోసం బాధ్యతలు అప్పగించనున్నారు. బుడమేరు వరద పీడిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కలెక్టరేట్‌లోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో మకాం వేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ వెంటనే కలెక్టరేట్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Sep 01 , 2024 | 07:04 PM

Advertising
Advertising