Share News

Assembly: ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక.. పీఏసీ ఛైర్మన్ ఎవరంటే..

ABN , Publish Date - Nov 22 , 2024 | 09:59 AM

ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు నిర్ణయించాయి.

Assembly: ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక.. పీఏసీ ఛైర్మన్ ఎవరంటే..

అమరావతి: ఏపీ అసెంబ్లీ (Assembly) లాబీలో పీఏసీ (PAC) సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ (Voting) జరగనుంది. బ్యాలెట్ పద్దతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ (Polling) ప్రక్రియ జరుగుతుంది. అయితే పీఏసీ సభ్యులకు తొలిసారిగా (First Time) ఎన్నిక జరుగుతోంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బరిలోకి దిగింది. ఆ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది.

తెలుగుదేశం తరఫున శ్రీరాం రాజగోపాల్, బీవీ జయ నాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధా కృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలితకుమారి నామినేషన్‌లు వేశారు. అలాగే జనసేన పార్టీ తరఫున పీఏసీ సభ్యత్వానికి పులపర్తి ఆంజనేయులు నామినేషన్ వేశారు. కాగా పీఏసీ చైర్మన్ పదవి జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి నేతలు ఆంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేశారు.


రసవత్తరంగా పీఏసీ ఎన్నిక..

శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ-పీఏసీ) ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు.. ఈ కమిటీ చైర్మన్‌ పదవికి జనసేనకు చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశాయి. అయినా పెద్దిరెడ్డి పోటీలో కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఖాయమవడంతో అసెంబ్లీ అధికారులు ఓటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ వేదికగా పనిచేసే కమిటీల్లో పీఏసీ కీలకమైనది. వివిధ ప్రభుత్వ శాఖలు పెట్టే ఖర్చుకు సంబంధించి కంపోట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఏ శాఖకు చెందిన అధికారులనైనా పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం దీనికి ఉంది. శాసనసభలో అనేక కమిటీలు ఉన్నా ఈ ఒక్క కమిటీ చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోం ది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్‌కు చైర్మన్‌ పదవి ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది.

ఈసారి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఒక సభ్యుడిని గెలిపించుకోవడానికి అవసరమైనంత బలం కూడా ఆ పార్టీకి లేదు. ఈ విషయం తెలిసినా కూటమి పార్టీలతో సంప్రదింపులు జరపకుండా పెద్దిరెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చంద్రశేఖర్‌ కూడా వచ్చారు. కాగా శుక్రవారంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అదానీ లంచాల యాత్ర.. ఇరుక్కున్న జగన్

అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ

ముడుపుల ముడి వీడింది

అమెరికాతో అట్లుంటది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 22 , 2024 | 10:20 AM