AP Politics: ఇదెక్కడి మాస్ కౌంటర్స్ సామీ.. అంబటికి అదిరిపోయిందిగా..!
ABN, Publish Date - Feb 16 , 2024 | 09:50 PM
TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారుతోంది. నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రజా క్షేత్రమైనా.. సోషల్ మీడియా అయినా.. వేదికైనా వదిలే ముచ్చటే లేదంటున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ ప్రత్యర్థులపై గునపాల్లాంటి మాటలతో రెచ్చిపోతున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) సమీపిస్తున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయం(AP Politics) రంజుగా మారుతోంది. నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రజా క్షేత్రమైనా.. సోషల్ మీడియా అయినా.. వేదికైనా వదిలే ముచ్చటే లేదంటున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ ప్రత్యర్థులపై గునపాల్లాంటి మాటలతో రెచ్చిపోతున్నారు. తాజాగా సీఎం జగన్(CM YS Jagan) చేసిన షర్ట్ మడతపెట్టాలని చేసిన కామెంట్స్‌కి.. ప్రతిపక్ష టీడీపీ(TDP) నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ పడుతున్నాయి. జగన్ షర్ట్ మడతపెడితే.. తాము కుర్చీ మెడతపెడతామని రివర్స్ అటాక్ చేశారు టీడీపీ, జనసేన శ్రేణులు. ఈ వార్ ఇలా నడుస్తుండగా.. మంత్రి అంబటి రాంబాబు సైతం తానేం తక్కువ అంటూ టీడీపీకి రివర్స్ కౌంటర్ ఇవ్వబోయారు. కానీ, అదికాస్తా తుస్సుమని.. టీడీపీ నుంచి దిమ్మతిరిగే కౌంటర్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది.
అవును, మంత్రి అంబటి రాంబాబును సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడుకుంటున్నారు. ‘ఇక్కడ ఉన్నది సింహాసనం. కుర్చీ కాదు మడతపెట్టడానికి’ అని చంద్రబాబు, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. ఆయన అలా చేయడమే ఆలస్యం.. టీడీపీ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. ఎక్స్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. అంబటికి మైండ్ బ్లాంక్ రిప్లే ఇచ్చారు. ‘మేం కూడా అదే చెబుతున్నాం అంబటి.. కుర్చీ అయితే మడత పెడతాం.. సింహాసనం అయితే.. దాని మీదున్న శునకాన్ని తరిమేస్తాం.. ఇది ఓకేనా..?’ అంటూ అంబటి రాంబాబు పోస్టుకు బుద్దా వెంకన్న రిప్లై ఇచ్చారు.
ఇక మరో నేత, మాజీ మంత్ర అమర్నాథ్ రెడ్డి సైతం అంబటికి కౌంటర్ ఇచ్చారు. ‘గతంలో అది సింహాసనమే.. ప్రస్తుతం అది గ్రామ సింహాసనం.. దానికా పేరు తెచ్చిన ఘనత ఎవరిదో నీకు తెలుసుగా అంబటి..’ అంటూ గునపాల్లాంటి కామెంట్స్‌తో రిప్లై ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Feb 16 , 2024 | 09:58 PM