20 నుంచి ఇసుక నిల్వ డిపోలు : కలెక్టర్
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:23 AM
20 నుంచి ఇసుక నిల్వ డిపోలు : కలెక్టర్
నంద్యాల కల్చరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇసుక నిల్వ డిపోలు ఈనెల 20 వ తేదీ నుండి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజకుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా ఇసుక సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చాంబర్ నుండి కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తోందన్నారు. సరిహద్దు చెక్‌పోస్టులలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గనుల శాఖ ఏడీ తదితరులు పాల్గొన్నారు.