Share News

25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:14 AM

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 25 నుం చి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్‌ కుమార్‌ రెడ్డి, టీ. రాంబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.

25 నుంచి 108 ఉద్యోగుల సమ్మె
సమ్మె నోటీసు అందజేస్తున్న 108 ఉద్యోగులు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 25 నుం చి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్‌ కుమార్‌ రెడ్డి, టీ. రాంబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 వ్యవస్థను ప్రభుత్వం నిర్వహించి ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులు, వేతనాలు, అర్జిత సేలవులకు అరవింద సంస్థ నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు. నాలుగేళ్లనుంచి బకాయి పెట్టిన 40 శాతం ఇంక్రిమెంట్‌ చెల్లించా లని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్‌ కల్పించాలని కోరారు.

Updated Date - Nov 16 , 2024 | 12:14 AM