ఆస్తి కోసం కన్న తల్లిపై కొడుకు దాడి
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:02 AM
ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియా పేటలో పార్వతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు నాగరాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. తాగుడుకు బానిసయ్యాడు.
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
ఆదోని, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదోని పట్టణంలోని విక్టోరియా పేటలో పార్వతికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు నాగరాజు జల్సాలకు అలవాటు పడ్డాడు. తాగుడుకు బానిసయ్యాడు. ఇదే క్రమంలో పనులు కోసం బెంగళూరుకు వెళ్లాడు. పార్వతికి తల్లిదండ్రుల నుంచి రెండు ఇళ్లు ఆస్తిలో భాగంగా వచ్చాయి. ఆ ఇళ్లను బాడుగకు ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్న పింఛను సహాయంతో జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం కూతురు దగ్గర ఉంటోంది. ఇల్లు తన పేరున చేయించాలని పార్వతిపై కొడుకు నాగరాజు ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో శుక్రవారం తల్లిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో గాయాలకు గురైన పార్వతిని స్థానికులు, బంధువులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.