Share News

సాంబార్‌ పాత్రలో పడి బాలుడి మృతి

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:50 PM

సాంబార్‌ పాత్రలో పడి ఓ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి చెందిన మంగళి వీరేష్‌ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి వచ్చింది.

సాంబార్‌ పాత్రలో పడి బాలుడి మృతి
జగదీష్‌ (ఫైల్‌)

గోనెగండ్ల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సాంబార్‌ పాత్రలో పడి ఓ బాలుడు శుక్రవారం మృతి చెందాడు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి చెందిన మంగళి వీరేష్‌ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి వచ్చింది. వీరేష్‌కు భార్య లక్ష్మీదేవి, ఒక కుమారుడు, ఇద్దరు కుతుళ్లు ఉన్నారు. వీరేష్‌ వేముగోడు గ్రామంలో బార్బర్‌ షాప్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే గురువారం గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా భార్యా పిల్లలతో కలిసి వెళ్లాడు. వీరేష్‌ కుమారుడు జగదీష్‌(5) తన తండ్రి సెల్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న వంటలు చేసే గుడిసెలోకి వెళ్లాడు. సెల్‌ఫోన్‌ చూసుకుంటూ అప్పుడే వంట వండి దించిన వేడి వేడి సాంబర్‌ పాత్రపై కూర్చున్నాడు. పిల్లవాడి బరువుకు సాంబర్‌ పాత్రపై ఉన్న మూత జరిగిపోయింది. దీంతో జగదీష్‌ వేడి వేడి సాంబార్‌లో పడ్డాడు. వేడికి తాళలేక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్య చికిత్స చేశారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడితో మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Nov 16 , 2024 | 11:50 PM