Share News

నేటి నుంచి అందరికీ క్యాన్సర్‌ పరీక్షలు

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:46 AM

నాన కమ్యూని కబుల్‌ డిసీజ్‌ 3.0 కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ జిల్లా వ్యాప్తంగా గురువారం క్యాన్సర్‌ పరీక్షలు ప్రారంభమౌతున్నట్లు డీఎంహెచఓ డా.ఎల్‌. భాస్కర్‌ తెలిపారు.

నేటి నుంచి అందరికీ క్యాన్సర్‌ పరీక్షలు
మాట్లాడుతున్న డీఎంహెచఓ భాస్కర్‌

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రారంభం

కర్నూలు, హస్పిటల్‌ 13(ఆంధ్రజ్యోతి): నాన కమ్యూని కబుల్‌ డిసీజ్‌ 3.0 కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ జిల్లా వ్యాప్తంగా గురువారం క్యాన్సర్‌ పరీక్షలు ప్రారంభమౌతున్నట్లు డీఎంహెచఓ డా.ఎల్‌. భాస్కర్‌ తెలిపారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎనసీడీ ప్రోగాం ఆఫీసర్‌ హేమలత జిల్లా మలేరియా అధికారి నూక రాజుతో కలిసి డీఎంహె చఓ విలేకరుల సమావేశం నిర్వహించా రు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన 16 లక్షల మందికి ఇంటి వద్దనే గ్రామీణ ప్రాంతాల్లో ఎం ఎల్‌హెచపీలు, ఏఎనఎంలు, ఆశాలు, పట్టణ ప్రాంతంలో ఏఎనఎంలు, ఆశాలు ఇంటింటా తిరిగి క్యాన్సర్‌ పరీక్షలు చేస్తారన్నారు. 909 మంది ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 127 మంది మోడికల్‌ ఆఫీసర్లు, 28 మంది నర్సులు, ఎంఎల్‌హెచపీలు, సీహెచవోలు 428 మంది ఏఎనఎంలు 326 మంది శిక్షణ పొందారని తెలిపారు. కాన్సర్‌ పరీక్ష ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతుందన్నారు. ప్రతి వైద్య బృందం ఐదు ఇళ్లను సందర్శించి క్యాన్సర్‌ పరీక్షలను చేస్తారని అనంతరం ఆనలైన పేరిట నమోదు నిర్వహి స్తుందని తెలిపారు. ముఖ్యంగా రొమ్ము, సర్వేకల్‌ క్యాన్సర్‌తో పాటు బీపీ, డయాబెటిస్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేస్తారన్నారు. అనుమానిత కేసులు ఉంటే పీహెచసీ, అర్బన హెల్త్‌ సెంటర్‌లకు పంపిస్తారని వ్యాధి ఉన్నట్లు తెలిస్తే కర్నూలు స్టేట్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌కు రెఫర్‌ చేస్తారన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:46 AM