సీసీ రోడ్డు నాసిరకంగా వేస్తున్నారని ఫిర్యాదు
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:25 AM
మద్దికెర సాయి నగర్ కాలనీలో ఉపాధి నిధులతో వేస్తున్న సీసీ రహదారి నాసిరకంగా వేస్తున్నారని కాలనీవాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు.
మద్దికెర,నవంబరు15(ఆంధ్రజ్యోతి): మద్దికెర సాయి నగర్ కాలనీలో ఉపాధి నిధులతో వేస్తున్న సీసీ రహదారి నాసిరకంగా వేస్తున్నారని కాలనీవాసులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. వివరాలు.. శుక్రవారం స కాలనీలో రూ 10లక్షల నిధులతో పనులను ప్రారంభించారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో పంచాయతీ, ఉపాధి అధికారులు లేరని, 7ఇంచులు వేయాల్సి రోడ్డు 4 ఇంచుల మందంలో వేస్తున్నారని కాలనీవాసులు నేరుగా జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. ఉన్నతాధికారులు స్పం దించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవిషయంపై పీఆర్ ఏఈ విష్ణును వివరణకోరగా నిబంధనలమేరకే సీసీ రహదారి నిర్మిస్తున్నారని, అలా చేయకుంటే కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరుకావన్నారు.