పిన్నాపురం అసైన్డ్ భూముల పరిశీలన
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:51 PM
మండలంలోని పిన్నాపురంలో సోలార్‌కు కేటాయించిన భూములను నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి పరిశీలించారు.
పాణ్యం, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పిన్నాపురంలో సోలార్‌కు కేటాయించిన భూములను నంద్యాల జిల్లా కలెక్టరు రాజకుమారి పరిశీలించారు. శనివారం ఆమె సోలార్ పరిశ్రమకు కేటాయించాల్సిన 276 ఎకరాల అసైన్డ్ భూముల ధరల మార్కెట్ విలువలపై చర్చించారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పరిశ్రమకు కేటాయించిన భూముల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సోలార్ పరిశ్రమ ఏరియల్ మ్యాపులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ విశ్వనాథ్, పాణ్యం తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి, డీటీ శివశంకర్, ఆర్‌ఐ రాము, వీఆర్వో నాయుడు, సర్వేయరు నాగరాజు, సోలార్ ప్రాజెక్ట్ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.