రైతులకు గరుసు దొంగల బెడద
ABN , Publish Date - Nov 23 , 2024 | 01:26 AM
నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరు లు ఆదోని నలువైపులా ఉన్న కొండలను పిండిచేసి గరుసు తవ్వుకొని ఆస్తులు పెంచుకు న్నారు.
పొలాలను రక్షించమంటున్న రైతులు
రైతుపై దౌర్జన్యానికి దిగిన అక్రమార్కులు
ఆదోని రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అనుచరు లు ఆదోని నలువైపులా ఉన్న కొండలను పిండిచేసి గరుసు తవ్వుకొని ఆస్తులు పెంచుకు న్నారు. నేడు కూటమి నాయ కులు వాళ్లను మించిపోయా రు. రాత్రింబవళ్లు ఆదోని చుట్టుపక్కల ఉన్న కొండల్లో గరుసు తవ్వుకొని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఎ మ్మెల్యే పార్థసారథికి కుడి భుజంగా ఉంటున్న గుడిసె కృష్ణమ్మ కన్నుసన్నల్లో గరుసు తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గరుసు తవ్వకాల వల్ల రైతులు లబో దిబోమంటున్నారు. ఆదోని పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులు తల్లి బోయ సుజాతమ్మ పేరిట ఎస్. కొండాపురంలో సర్వే నెం.116లో 3.46 ఎకరాల భూమి ఉంది. ఈ పొలం చుట్టూ కొండలు ఉన్నాయి. ఈ కొండల్లో గతంలో టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మ అనుచరుడు కపటి గ్రామానికి చెందిన మాధవ అక్రమంగా గరుసు తవ్వుకుంటున్నాడు. గరుసును తవ్వడం వలన తమ పంటలు నాశనం అవుతా యని పలుమార్లు రైతు శ్రీనివాసులు, ఆయన తల్లి సరోజమ్మ అడ్డుకోడానికి ప్రయత్నిం చారు. గరువు తవ్వితే కొండల్లో నుంచి నీరు వచ్చి పంట పొలాలు నాశనమవుుతాయని, పొలాలపై మట్టి పడుతుందని రైతు శ్రీనివాసులు తవ్వకాల ఫొటోలను తీశాడు. శుక్రవారం గరుసు తవ్వకాలను అడ్డుకోడా నికి రైతు ప్రయత్నించాడు. దానికి తవ్వకాలను ఆపేది లేదని, ఎవరికైనా చెప్పుకోమని కపటి మాధవ దౌర్జన్యానికి దిగాడని రైతు తెలిపాడు. గుడిసె కృష్ణమ్మ అనుచరుడు కపటి మాధవ చేపట్టిన గరుసు తవ్వకాలను ఆపాలని, పొలాలను రక్షించాలని రైతు శ్రీనివాసులు కోరాడు.