Share News

రైతులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:28 AM

గ్రామసభల్లో రైతుల నుంచి స్వీకరించిన అర్జీలను వేగంతంగా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు.

రైతులకు న్యాయం చేయాలి
రైతులతో మాట్లాడుతున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

కోసిగి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గ్రామసభల్లో రైతుల నుంచి స్వీకరించిన అర్జీలను వేగంతంగా పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. శుక్రవారం కోసిగిలోని పెండేకల్‌ రెవెన్యూ అధికారులు, అర్జీదారులతో సబ్‌కలెక్టర్‌ మాట్లాడారు. గతం లో జరిగిన రీసర్వేలో భూవ్యత్యాసాలు, పేర్లు తప్పుగా ఉండే అర్జీలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. ార్యక్రమంలో తహసీల్దార్‌ నిత్యనందరాజు, డిప్యూటీ తహసీల్దార్‌ రుద్ర గౌడ్‌, డివిజనల్‌ సర్వేయర్‌ వేణు సూర్య, మం డల సర్వేయర్‌ శ్రీనివాసులు వీఆర్వోలు వీరేష్‌, బసవ రాజు, వీరేష్‌, రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:28 AM