Share News

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:13 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడుగా నిలిచిపోతారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కొనియాడారు.

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం
బాల సుబ్రహ్మణ్యం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కళాకారులు

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 25: తెలుగు సినీ పరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడుగా నిలిచిపోతారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కొనియాడారు. బుధవారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో దివంగత తెలుగు సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుబ్ర హ్మణ్యం చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినీ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు సీవీ రెడ్డి, రాజారత్నం, యాగంటీశ్వరప్ప, ఈశ్వరయ్య, లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 01:13 AM