ఘనంగా కార్తీక పౌర్ణమి
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:30 AM
నగరంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు.
కర్నూలు కల్చరల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నగరంలో కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కర్నూలు కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్‌కు ఇరువైపులా విద్యుద్దీపా లతో అలంకరించారు. మైక్‌ల ద్వారా ఘాట్ వద్ద జరుగుతున్న కార్యక్ర మాలను ప్రసారం చేశారు. సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించి, 6 గంటలకు వినాయక మందిరం నుంచి కేసీ కెనాల్ వినాయక ఘాట్ వరకు శివపార్వతుల విగ్రహాలతో రథయాత్ర నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ధ్వజా రోహణ, ఆకాశజ్యోతి, జ్యోతి ప్రజ్వనతో లక్ష దీపోత్సవాలు ప్రారంభించారు. సాయంత్రం 7 గంటలకు మామిళ్లపల్లి నాగఫణిశాసి్త్ర బృందం ఆధ్వర్యంలో తుంగభద్రమ్మ నదికి తుంగా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్ర మంలో కలెక్టర్ పి.రంజిత బాషా, జేసీ డాక్టర్ బి. నవ్య, ట్రైనీ కలెక్టర్ కల్యాణి, నగర మేయర్ బీవై రామయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్‌పర్సన ఎస్‌వీ విజయమనోహరి, దీపోత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఇ.పద్మావతమ్మ, రాధిక పాల్గొన్నారు.
ఫ నగరంలోని వివిధ ఆలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని భరతమాత ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి, జ్వాలా తోరణం, దీపోత్సవం, సామూహిక మంగళ హారతులు నిర్వహించారు. అశోక్ నగర్ లోని అభయాంజనేయ స్వామి, ద్వారకామయి ఆలయంలో దీపోత్సవాలు చేపట్టారు. పాత నగరంలోని శివాలయంలో, షిరిడీ సాయిబాబా ఆలయా ల్లో, నెహ్రూ రోడ్డులోని సత్యసాయి మందిరంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై దీపోత్సవాలు నిర్వహించారు.
ఓర్వకల్లు: మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. ఓర్వకల్లులోని జీవేశ్వర స్వామి ఆలయంలో శృంగేరి ఉభయ జగద్గురువుల ఆశీర్వాదంతో రుగ్వేద, జ్యోతిష్య విద్యాంసులు విరివింటి ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన, దీపోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీటీడీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ దంపతులు హాజరై శివునికి ప్రత్యేక పూజలు జరిపించి కార్తీక దీపాలు వెలిగించారు. ఏడో అదనపు జిల్లా న్యాయాధికారి జి.భూపాల్‌రెడ్డి దంప తులు, నంద్యాల జిల్లా డ్వామా పీడీ భాస్కర్‌నాయుడు స్వామివార్లను దర్శించుకున్నారు. పొదుపు లక్ష్మి మండల ఐక్య సంఘం గౌరవ సలహాదారురాలు విజయభారతి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో మద్దిలేటి, ప్రధానార్చకులు కళ్లె లక్ష్మీనారాయణశర్మ, కళ్లె లక్ష్మీనరసింహశర్మ భక్తులకు మౌలిక సదుపా యాలు కల్పించారు.
కోడుమూరు రూరల్: మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. లద్దగిరి రామలింగేశ్వ రస్వామి, ప్యాలకుర్తి భీమలింగేశ్వరస్వామి, వర్కూరు సిద్ధేశ్వరస్వామి ఆల యాల్లో వేకువజామునే పంచామృతాభిషేకం, పుష్ప, బిల్వార్చనలు నిర్వ హించారు. లద్దగిరి రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల కవితమ్మ, కోట్ల మంజుల, కోట్ల భానుశ్రీ ముందుగా హంద్రీనదిలో కార్తీక దీపాలు వదిలారు.