Share News

బాధితుడికి గొలుసు అప్పగింత

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:49 AM

రైల్లో పోగొట్టుకున్న బంగారు గొలుసును రైల్వే పోలీసులు బాధితునికి అప్పగించారు.

బాధితుడికి గొలుసు అప్పగింత
బాధితుడికి గొలుసును అందజేస్తున్న పోలీసులు

కర్నూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైల్లో పోగొట్టుకున్న బంగారు గొలుసును రైల్వే పోలీసులు బాధితునికి అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శేఖర్‌ ఈనెల 12వ తేదీన రైల్లో ప్రయాణిస్తూ కంభం రైల్వే స్టేషనలో దిగాడు. ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకుంటే తన మెడలో ఉన్న 3.5 తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో వెంటనే వచ్చి రైల్వే స్టేషనలో విధుల్లో ఉన్న రైల్వే పోలీసులను సంప్రదించారు. ఆ కానిస్టేబుల్‌ రైలులో డ్యూటీలో ఉన్న సూర్యప్రకాష్‌, సలీం అనే కానిస్టేబుళ్లకు సమాచారం అందించారు. వారు నంద్యాలకు రైలు వచ్చే సరికి ఆ ప్రయాణికుడు ప్రయాణించిన బెర్తు వద్దకు వెళ్లి పరిశీలిస్తే అక్కడ బంగారు గొలుసు కనిపించింది. ఆ బంగారు గొలుసును బుధవారం శేఖర్‌కు అప్పగించినట్లు రైల్వే సీఐ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 12:49 AM