Share News

భారీగా పత్తి ధర పతనం

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:06 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర భారీగా పతనమైంది. శుక్రవారం పత్తి ధర క్వింటం రూ.7099 పడి పోయింది.

భారీగా పత్తి ధర పతనం

ఆదోని అగ్రికల్చర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర భారీగా పతనమైంది. శుక్రవారం పత్తి ధర క్వింటం రూ.7099 పడి పోయింది. కనిష్ఠ ధర రూ.3969, మధ్యస్థ ధర రూ.6889 పలికింది. గత వారంతో పోల్చితే క్వింటానికి రూ.400పైగా తగ్గింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్‌లో వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేస్తున్నప్పటికీ పత్తి ధరల పెరుగుదలలో మార్పు రాలేదని రైతులు వాపోతున్నారు. పత్తి గింజల ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పతనం కావడం వల్ల స్థానిక మార్కెట్‌లో ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు. కాగా 3544 క్వింటాళ్ల పత్తి విక్రయానికి వచ్చింది.

శని, ఆదివారాల్లో పత్తి కొనుగోలు ఉండదు

ప్రతి శని, ఆదివారం సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు ఉండదని మార్కెట్‌ యార్డు కార్యదర్శి రామ్మోహన్‌ రెడ్డి తెలిపారు. సీసీఐకి విక్రయించుకునేందుకు ముందుగానే పేర్లు నమోదు చేసుకున్న రైతులు ఇది గమనించాలని సూచిం చారు. సీసీఐ కేంద్ర నిర్వాహకులే ఫోన్‌ ద్వారా తెలియజేసినప్పుడే విక్రయానికి పత్తి తీసుకురావాలని తెలిపారు.

Updated Date - Nov 16 , 2024 | 12:06 AM