ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు : కమిషనర్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:32 AM

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రా లు అని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ రవీంద్ర బాబు అన్నారు.

కమిషనర్‌ను సత్కరిస్తున్న కేసీ కల్కూర, ప్రకాశ తదితరులు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రా లు అని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ రవీంద్ర బాబు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన, పురాతన నాణెముల ప్రదర్శనల ప్రారంభ కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విభిన్న పుస్తకాలను ఆయన పరిశీలించారు. అలాగే పురాతన నాణెములను దర్శిం చి, వాటి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కమిషనర్‌ మాట్లాడుతూ నిత్యం గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలు పఠనం చేయడం వల్ల విజ్ఞానం వికసిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. కమిషనర్‌ను మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కేసీ కల్కూర, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే ప్రకాశలు సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు వజ్రా ల గోవిందరెడ్డి, ఎస్‌ బాషా, విశ్రాంత ఇంజినీర్‌ ముచ్చుకోట చంద్రశేఖర్‌, నిఖిలేష్‌ ఎడ్యుకేషన సొసైటీ అధ్యక్షుడు మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:32 AM