ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోడలిని హత మార్చిన మామ అరెస్టు

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:42 AM

కోడలిని చంపిన కేసులో మామతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశామని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామానికి చెందిన శిరీషను ఆమె మామ కురుమన్న శుక్రవారం బండరాయితో బాది చంపాడని చెప్పారు

స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిస్తున్న శిరీష బంధువులు, ఇన్‌సెట్‌లో శిరీష పిల్లలు పావని, నవదీప్‌

నందికొట్కూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కోడలిని చంపిన కేసులో మామతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశామని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామానికి చెందిన శిరీషను ఆమె మామ కురుమన్న శుక్రవారం బండరాయితో బాది చంపాడని చెప్పారు. ఈ కేసులో కురుమన్నతోపాటు, శిరీష అత్త శేషమ్మ, భర్త నరసింహులు, ఆడపడుచులు మల్లేశ్వరి, వేనమ్మలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిరీష హత్యతో అభం శుభం తెలియని చిన్నారులు పావని, నవదీప్‌లు తల్లిలేని పిల్లలయ్యారు.

పోలీసుస్టేషన్‌ ముట్టడి :

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలంటూ శిరీష కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసుస్టేషన్‌ ముందు నిరసన చేపట్టారు. నిందితులను ఆరోగ్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లే సమయంలో ఒక్కసారిగా స్టేషన్‌ గేట్లను తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలని పట్టుబట్టడంతో పోలీసులు వారిని శాంతింపజేసి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

Updated Date - Oct 20 , 2024 | 12:51 AM