ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:25 AM
ప్రజా సమస్యలు పరిష్క రించకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్‌బాబు, జిల్లా నాయకులు రంగయ్య, కరుణాకర్ అన్నారు.
గోనెగండ్ల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్క రించకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్‌బాబు, జిల్లా నాయకులు రంగయ్య, కరుణాకర్ అన్నారు. గోనెగండ్లలో బస్టాండ్ సెంటర్‌లో నిరసన తెలిపి ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరారు. అక్కడ ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను గాలికి వదిలివేసిందన్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. గ్రామాలలో బెల్టుషాపులను అరికట్టా లని డిమాండ్ చేశారు. గోనెగండ్లలో బస్‌షెల్టర్‌ను పునరుద్ధరించాలని , ప్రయాణికులకు టాయిలెట్‌లు నిర్మించాలని కోరారు. అనంతరం ఎంపీ డీవో మణిమంజరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు నబిరసూల్, దండుఖాజా, నరసింహులు,గిరిరాజు, అక్బర్, గోవిందు, బతకన్న, మునెప్ప, వెంకటేశ్వరమ్మ, తిమ్మప్ప, జయన్న, మోహన, దరగయ్య, రంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:25 AM