వైసీపీవి స్వార్థ రాజకీయాలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:00 AM
వైసీపీ నాయకులవి స్వార్థ రాజకీయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
కర్నూలు అర్బన్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులవి స్వార్థ రాజకీయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొజ్జమ్మ నియామకంపై వైసీపీ పలు రకాలుగా దుష్ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వాల్మీకులు కలిసి కట్టుగా పని చేసి పార్టీని జిల్లాలో గెలిపించారని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే కప్పట్రాళ్ల బొజ్జమ్మను బోయ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించినట్లు తెలిపారు. ఆమె తండ్రి కపట్రాళ్ల వెంకటప్పనాయుడు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకుడిగా సేవలందిచారని అన్నారు. జిల్లాలో బీసీలకు ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేగా పార్టీ అవకాశాలు కల్పించిందని తెలిపారు.