ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం అన్యాయం

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:26 AM

కర్నూలు నుంచి మానవహక్కుల కమిషన, లోకాయుక్త కార్యాలయాలను తరలించడం సరికాదని, ఆర్‌వీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఖాజా అన్నారు.

మాట్లాడుతున్న ఆర్‌ఏవీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ

ఎమ్మిగనూరు టౌన, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి మానవహక్కుల కమిషన, లోకాయుక్త కార్యాలయాలను తరలించడం సరికాదని, ఆర్‌వీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఖాజా అన్నారు. శుక్రవారం పట్ట ణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శ్రీబాగ్‌ ఒప్పందాన్ని తుంగలో తొక్కు తూ హై కోర్టు ఏర్పాటు కాకుండా రాష్ట్ర లోకాయుక్త , రాష్ట్ర మానవహక్కుల కమిషన కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇది రాయలసీమకు తీరని అన్యాయం చేయడమేనన్నారు. కొప్పర్తి ఇండస్ర్టియల్‌ ఎంఎస్‌ఎం ఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి రాష్ట్ర లోకాయుక్త, మానవహక్కుల కమిషన కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించేలా పోరాడాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మోహన, రమణ, రామాంజి, వెంకట్రాముడు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:26 AM