Share News

న్యాయ సంస్థల తరలింపు సరికాదు

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:59 PM

కర్నూలు నుంచి జిల్లా నుంచి న్యాయ సంస్థల తరలింపును వైసీపీ వ్యతిరేకిస్తోందని కర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు

న్యాయ సంస్థల తరలింపు సరికాదు
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు

కర్నూలు న్యూసిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి జిల్లా నుంచి న్యాయ సంస్థల తరలింపును వైసీపీ వ్యతిరేకిస్తోందని కర్నూలు, నంద్యాల వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. న్యాయ సంస్థలను అమరావతికి తరలించకూడదని న్యాయవాదులతో కలిసి శనివారం జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నుంచి జ్యుడీషియల్‌ సంస్థను తరలించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంతో కర్నూలను న్యాయ రాజధానిగా ప్రకటించారని, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి పునాదితో పాటు హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, వక్ఫ్‌ ట్రిబ్యునల్‌, సీబీఐ కోర్టు వంటి సంస్థలు ఏర్పాటు అయ్యాయని వారు వివరించారు. ఈ సంస్థలను మార్చాలని కోరుతూ హైకోర్టులో టీడీపీ ప్రభుత్వం చేసిన అఫిడవిట్‌ దాఖలు చేయడమంటే శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే న్యాయపరమైన అవకాశాలను అన్వేషిస్తామని, ప్రజా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బీవై.రామయ్య, కార్పొరేటర్లు సత్యనారాయణమ్మ, నారాయణరెడ్డి, సోంపల్లి క్రిష్ణకాంత్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:59 PM