శ్రీశైలం ఇన్‌చార్జి ఈవోగా చంద్రశేఖరరెడ్డి
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:51 PM
శ్రీశైలం దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా ఇ.చంద్రశేఖరరెడ్డి శనివారం ఉద యం బాధ్యతలు స్వీకరించారు.
శ్రీశైలం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా ఇ.చంద్రశేఖరరెడ్డి శనివారం ఉద యం బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న డి.పెద్దిరాజును ఆయన మాతృ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో శ్రీశైలం దేవస్థానంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు ఇన్‌చార్జి ఈవోగా నియమి స్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి శనివారం ఉదయం ఆలయ పరిపాలన భవనంలోని ఈవో చాంబర్ లో ఇ. చంద్రశేఖరరెడ్డి శ్రీశైలం దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి ఆలయ అర్చకులు, వేదపండితులు చంద్రశేఖరరెడ్డికి వేదాశీర్వాదం పలికారు. అనంతరం దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులతో మాట్లాడుతూ రానున్న కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Updated Date - Oct 19 , 2024 | 11:51 PM