లోకాయుక్త, హెచ్‌ఆర్సీని కర్నూలులోనే కొనసాగించాలి
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:14 AM
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త కార్యాలయాలు కర్నూ లులోనే కొనసాగించాలని ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు.
ఎంపీ బస్తిపాటికి ఆర్వీపీఎస్ వినతి
కర్నూలు అర్బన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయం, లోకాయుక్త కార్యాలయాలు కర్నూ లులోనే కొనసాగించాలని ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజుకు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాల యం, లోకాయుక్త కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేశారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమరా వతికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తోందని, కర్నూలులోనే కొనసాగించేలా సీఎం చంద్రబా బుకు తెలియజేయాలని ఎంపీని కోరారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు అమరావతి, వైజాగ్, అంటూ రాయలసీమను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. పూర్తిగా వెనుక బడిన రాయలసీమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని అన్నారు. కర్నూలులో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కార్యాలయాలను అమరావతికి తరలించ డాన్ని నిలిపివే యాలని కోరారు. ఈ కార్యాల యాలు కర్నూలులో ఏర్పాటు చేయడం చట్టవి రుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోర్టులను కోరిన డాక్టర్ మద్దిపాటి శైలజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న, మదాసీ కురువ ప్రకాష్, కే సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అడ్డుకుంటాం
కర్నూలు న్యూసిటీ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):
లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమి షనర్ కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించడాన్ని అడ్డుకుంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు న్యాయం రాజధాని ఏర్పాటులో భాగంగా లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏసీబీ కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమపై సవత తల్లి పేమ్ర చూపిస్తూ వాటిని అమరావతికి తరలించాలని నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. ఇదే జరిగితే రాయలసీమ వాసులుగా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.
ఆ కార్యాలయాలను కర్నూలులోనే ఉంచాలి
కర్నూలు కల్చరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సందర్భంగా కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యాల యాలను ఇక్కడే కొనసాగించాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయంలో వారు ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలులో ఏర్పాటు చేసిన వక్ప్ప్ బోర్డు కార్యాలయం, లోకాయుక్త రాష్ట్ర కార్యాలయం, మానవ హక్కుల కమిషన్, జాతీయ న్యాయ విద్యా కళాశాల తదితర రాష్ట్రస్థాయి కార్యాలయాలను అమరా వతికి తరలించాలని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అన్నారు. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని వలసలను నివారించి, అభివృద్ధి చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర హైకోర్టును, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యా లయం కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీమ విద్యావంతుల వేదిక భాస్కర్‌రెడ్డి, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి శేషాద్రి రెడ్డి, కేఎన్‌పీఎస్ బాధ్యుడు సుబ్బరాయుడు, డీటీఎఫ్ బాధ్యడు రత్నం ఏసేపు తదితరులు పాల్గొన్నారు.
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కర్నూలులోనే..
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి : మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): లోకాయుక్త సంస్థ, మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) కర్నూల్లోనే ఉంటాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర రాజధానిలో మంత్రి మాట్లాడుతూ కర్నూల్లో ఇప్పటికే నెలకొల్పిన సంస్థలు ఏవీ ఇక్కడి నుంచి తరలించబోమని తెలిపారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్‌తో చర్చించినట్లు తెలిపారు. ఈ సంస్థలన్నీ కర్నూల్లోనే ఉంటాయని హామీ ఇస్తున్నాని తెలిపారు. ప్రజలెవ్వరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ కర్నూల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు.
Updated Date - Nov 16 , 2024 | 01:14 AM