ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

ABN, Publish Date - Jun 30 , 2024 | 11:42 PM

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

తప్పు చేసిన అధికారులపై విజిలెన్సు విచారణ చేయిస్తాం

రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ

బనగానపల్లె , జూన్‌ 30 : గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బనగాపల్లె ఎంపీడీవో కార్యాలయంలో.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి మండల సర్వసభ్య సమావేశానికి మంత్రి బీసీ జనార్దర్‌రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ మానసవీణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తాగునీరు, విద్య, వైద్యం వ్యవసాయం, ఐసీడీఎస్‌, గృహనిర్మాణం తదితర శాఖలపై చర్చ జరిగింది. సర్పంచ్‌లు ఎంపీటీసీలు గ్రామాల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. రామతీర్థంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని సభ్యులు అన్నారు. పాతపాడులో పాఠశాల వద్ద డ్రైనేజీ అసంపూర్తిగా ఉందని, దాన్ని పూర్తి చేయాలని కోరారు. మిట్టపల్లె సర్పంచ్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో వీఽధిలైట్లు వేయడానికి కూడా డబ్బుల్లేవని సభ దృష్టికి తెచ్చారు. తమ గ్రామంలో గత టీడీపీ హయంలో మంచినీటి ట్యాంకును నిర్మించారని, కానీ దానికి వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదని వాపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాగంటిపల్లెలో వైసీపీ నాయకులు లబ్ధిదారులకు అనువైన చోట స్థలం ఇవ్వలేదని, దీంతో పేదలు ఇళ్లు నిర్మించుకోలేదని అన్నారు. నిర్మించని ఇళ్లను గతంలో అట్టహాసంగా ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. కొందరు పంచాయతీ సెక్రటరీలు, వీఆర్‌వోలు విర్రవీగి వైసీపీ తొత్తులుగా మారారని, వారు ఎక్కడ ఉన్నా విజిలెన్సు విచారణ జరిపి సస్పెండ్‌ చేయిస్తామని అన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో తప్పు చేసిన అధికారులను వదదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చాలా చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు లేవని, ఈ వివరాలను ఇవ్వాలని మంత్రి సీడీపీవో ఉమా మహేశ్వమ్మను ఆదేశించారు. తిమ్మాపురంలో 5 ఏళ్లుగా పాఠశాల భవనాలు లేక ఇబ్బంది పడుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. అధికారులు, వైసీపీ నాయకులు కలిసి ప్రజలను వేధించి కష్టనష్టాలకు గురిచేశారన్నారు. తెలుగుదేశం పాలనలో అధికారులు స్వేచ్ఛగా పనిచేసి ప్రజలకు సేవలందించాలన్నారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని, ఎన్నికల మ్యానిఫెస్టోకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు తీయిస్తామన్నారు. సోమవారం పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు బీసీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగరాజు, ఆర్‌ఆండ్‌బీ డీఈ శ్రీధర్‌రెడ్డి, డీఈలు నాగశ్రీనివాసులు, ఉమాకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 11:42 PM

Advertising
Advertising