ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలి

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:52 PM

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌ రెడ్డి అన్నారు.

సంఘీభావం తెలుపుతున్న సమితి ప్రతినిధులు, రైతులు

రాయలసీమ హక్కుల దినోత్సవంలో వక్తల డిమాండ్‌

నంద్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌ రెడ్డి అన్నారు. రాయలసీమకు హక్కులను కల్పిస్తూ 1937 నవంబరు 16న శ్రీబాగ్‌ ఒడంబడికను రూపొందించిన సందర్భంగా లాయర్‌ కృష్ణారెడ్డి అధ్యక్షతన నంద్యాలలోని భగీరథ సమావేశ మందిరంలో రాయలసీమ హక్కుల దినోత్సవాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎన్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగి 87 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కీలక అంశాలైన కృష్ణా, తుంగభద్ర నదీజలాల ప్రథమ ప్రాధాన్యత, పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని, హైకోర్టు వంటి హామీలను నేటికీ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాయలసీమ వివక్షకు గురవుతోందన్నారు. భారత రాజ్యాంగం, ఏపీ రాష్ట్ర విభజన చట్టం కూడా రాయలసీమకు హక్కులను కల్పించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. రాయలసీమ సాగునీటి రంగానికి బడ్జెట్‌లో 42శాతం నిధులు కేటాయించారని, ఒప్పందంలోని హక్కులను పాలకులు గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్‌ విశ్రాంత ఏజీఎం శివనాగిరెడ్డి, రైతు నాయకులు బాలీశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, కొండారెడ్డి, సమితి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 11:52 PM