Share News

ఆదివాసుల సమగ్రాభివృద్ధే ఎన్డీఏ లక్ష్యం

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:17 AM

ఆదివాసుల సమగ్రాభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.

ఆదివాసుల సమగ్రాభివృద్ధే ఎన్డీఏ లక్ష్యం
వెనుక వరుసలో కూర్చున్న గిరిజన సర్పంచ్‌

పీఎం జన్‌మన్‌ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

కొట్టాలచెరువులో ప్రత్యక్ష ప్రసార సభను వీక్షించిన జిల్లా అధికారులు

సభలో చెంచు మహిళా సర్పంచ్‌కు అవమానం

ఆత్మకూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆదివాసుల సమగ్రాభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బిహార్‌ రాష్ట్రంలోని జముయి జిల్లాలో రూ.6640 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని దేశంలోని అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో అధికారులతో పాటు ఆదివాసులు వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువులో ఏర్పాటు చేసిన వర్చ్యువల్‌ సదస్సుకు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వెంకట శివప్రసాద్‌, ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, డీఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, హౌసింగ్‌ పీడీ వెంకటసుబ్బయ్య తదితరులు హాజరయ్యారు.

అధికారుల అలసత్వం, గిరిజన సర్పంచ్‌కు అవమానం :

ఐటీడీఏ అధికారులు కొట్టాలచెరువులోని కొంతమంది గిరిజనులతో పాటు వివిధ శాఖల అధికారులు, సచివా లయ సిబ్బందిని, పాఠశాల విద్యార్థులను కార్యక్రమాన్ని మమ అనిపించారు. కలెక్టర్‌ రాజకుమారి పర్యటన చివరి క్షణాల్లో రద్దయింది. ఇదే అదునుగా అక్కడికి వచ్చిన చాలా మంది జిల్లా, మండల స్థాయి అధికారులు సభలో కూచోకుండా తమ కార్లలో కుర్చొని సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తూ కనిపించారు. సభకు హాజరైన కొట్టాలచెరువు గ్రామ గిరిజన సర్పంచ్‌ నాగలక్ష్మిని కనీసం పట్టించు కోలేదు. ఆమెకు తొలుత మొదటి వరుసలో కుర్చీ ఉంచిన ప్పటికీ అధికారులు రాగానే ఆమె వెనక వరసలోకి వెళ్లాల్సి వచ్చింది. గిరిజన సర్పంచ్‌ను అవమానించడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహంతో అధికారులను నిలదీ శారు శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్‌, ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి వారిని సర్దిచెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 01:17 AM