యురేనియం తవ్వకాలు ఆపేస్తున్నాం
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:08 AM
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు సంబంధించిన అన్ని చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలకు సంబంధించిన అన్ని చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈ నెల 14వ తేదీన ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్‌కు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. యురేనియం బోర్ల తవ్వకాల ప్రతిపాదనలకు సంబంధించి ఇకపై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:08 AM