Like the paddy field...: చినుకు రాలె.. వరి నేలవాలె...
ABN, Publish Date - Oct 16 , 2024 | 11:37 PM
తుపా ను దెబ్బతో ఏకధాటిగా చినకులు రాలుతుండ గా చేతికొచ్చిన వరి పంట నేల వాలిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చెలరేగిన తుపాను రైతుల గుండె ను అవిశిపోయేలా చేస్తోంది. మరో మూడు రోజులు వర్షం ఇలాగే కురిస్తే చేలో ధాన్యం మొలకలు వస్తాయని రైతులు వాపోతున్నారు.
రైతు గుండెల్లో తుఫాను
మరో మూడురోజులు వర్షాలు కురిస్తే తీవ్ర నష్టమే
కోత ధర చుక్కల్లోనే....
చెన్నూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తుపా ను దెబ్బతో ఏకధాటిగా చినకులు రాలుతుండ గా చేతికొచ్చిన వరి పంట నేల వాలిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చెలరేగిన తుపాను రైతుల గుండె ను అవిశిపోయేలా చేస్తోంది. మరో మూడు రోజులు వర్షం ఇలాగే కురిస్తే చేలో ధాన్యం మొలకలు వస్తాయని రైతులు వాపోతున్నారు. కోయాల్సిన పరిస్థితే వస్తే కోతమిషన్ బాడుగ గంటకు దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు కూడా అడుగుతున్నారని వా పోతున్నారు. చెన్నూరు మండలంలో 982 ఎక రాల్లో వరిపంట నేలవాలిందని మండల వ్యవ సాయాధికారి శ్రీదేవి తెలిపారు. కమలాపురం, వల్లూరు మండలాల్లో 850 ఎకరాల్లో వరి పైరు నేలకొరిగిందని, 250 ఎకరాల మినుము పంట లో నీరు చేరిందని ప్రాధమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని వ్యవసాయ సహా య సంచాలకులు పి.వెంకటక్రిష్ణ తెలిపారు. వివరాల్లోకెళితే....
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మూ డురోజులుగా కురుస్తున్న వర్షాలు రైతు గుండెలను గుభేలమనిపి స్తోంది. మండల వ్యాప్తంగా బోర్ల కింద సాగు చేసిన వరి ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. సుమారు మరో వారం పది రోజుల్లో వెయ్యి ఎకరాల పంట కోయాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కురుస్తున్న వర్షం రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడం రైతుకు నష్టాన్ని కలిగించే పరిస్థితి ఏర్ప డుతోందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఫలితంగా ధాన్యంపై మొ లకలు రావడం, గింజలు నల్లగా మారుతుందని ఇదే పరిస్థితి గతంలో ఉండేదని భయపడుతు న్నారు. రామనపల్లె, బయనపల్లె, గుర్రంపాడు తదితర ప్రాంతాల్లో కోత దశలో వరి సిద్దంగా ఉంది. రెండు మూడు రోజుల కిందటే కోయాలనుకున్న రైతులు తు పా ను ప్రభావిత వర్షాలతో బెంబెలేత్తుతున్నారు.
982 ఎకరాల్లో వరిపంటకు నష్టం
వరి నేలవాలిన ప్రాంతాలను వ్యవసా యాధికారి శ్రీదేవి పర్యటించి ఏ మేరకు వరి నేలవాలిందని నష్టంపై నివేదికలు తయారు చేశారు. చెన్నూరు మండలంలో సుమారు 982 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాధమిక అంచనా తయారు చేశారు. 12 రెవెన్యూ గ్రా మాల్లో దెబ్బతిన్న పంటలను బుధవారం ఏఓ పరిశీలించారు. దౌలతాపురం, రామనపల్లె, బ యనపల్లె గ్రామాల్లో వరి పంట వర్షాలతో నీట మునిగిందని, పలుచోట్ల నీటిలోనే పంట వాల డంతో ధాన్యంపై మోసులు వచ్చాయన్నారు.
కమలాపురం మండలంలో...
కమలాపురం రూరల్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి):
రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మండ ల పరిధిలో పంటలు నీట మునిగాయి. తుపా ను ప్రభావంతో అధిక వర్షానికి గంగవరం సమీపంలో వరి పంట నేలకొరిగింది. రైతుల ను ఆదుకోవాలని కోరారు. గంగవరం గ్రామం లో కమలాపురం సహాయ వ్యవసాయ సంచా లకులు పర్యటించారు. వరి, మినుము పంట లను పరిశీలించారు. తుపానుతో కమలాపురం, వల్లూరు మండలాల్లో 850 ఎకరాల్లో వరి పైరు నేలకొరింగిదని ప్రాధమిక నివేదికను ఉన్నతాధి కారులకు పంపించామని తెలిపారు. వరి పం టలో పడిపోయిన దుబ్బులను నిలబెట్టి గుంపు లుగా కట్టాలని సూచించారు. వర్షం ఆగిన వెం టనే ఎరువులు 19 -19 - 19ను ఐదు గ్రాము లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. పిచికారీ చేసుకోవడం వల్ల పంటల ను కాపాడుకోవచ్చని తెలిపారు. మండల వ్యవ సాయాధికారి సరస్వతి పలు గ్రామాల్లో పంట లను పరిశీలించారు. వ్యవసాయ సహాయకులు పి.వెంకటక్రిష్ణ, రైతులు పాల్గొన్నారు.
బాలుగారిపల్లెలో...
వల్లూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో చేతికి వచ్చిన వరి పంట వర్షంధాటికి నేలకొరిగిందని రైతులు తీవ్ర ఆవేదనకు గురవు తున్నారు. బాలుగారిపల్లెలో దాదాపు 70 నుం చి 80 ఎకరాలకు పైగా రెండు మూడురోజుల్లో కోయాల్సిన పంట వర్షం ధాటికి వాలిపోయింద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో కోతకు వచ్చిన వరికి మోసులు వచ్చే అవకాశం ఉంద ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓకవేళ కోయాల్సిన పరిస్థితి వస్తే మిషన్ బాడుగ గం టకు దాదాపు మూడు నుంచి నాలుగు వేల రూపాయలకు కూడా అడుగుతున్నారని వాపో తున్నారు. మినుముపంట కూడా అక్కడక్కడా కొంత దెబ్బతిన్నట్లు సమాచారం. వర్షం ధాటికి దాదాపు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా గే కొనసాగితే తీవ్రంగా నష్టపోతామన్నారు. ప్ర భుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వీరపునాయునిపల్లె మండలంలో....
వీరపునాయునిపల్లె, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రబీలో సాగుచేసిన ప్రత్యామ్నాయ పంటలు దెబ్బతింటున్నాయని రైతుల ఆందోళన చెందు తున్నారు. అప్పు చేసి వేల రూపాయలు పెట్టు బడి పెట్టి శనగ, పెసర వంటి పంటలను సాగుచేశామని పలువురు రైతులు అన్నారు. ఇపుడు వర్షం కురుస్తుండడంతో పంటలు పూ ర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేంపల్లె మండలంలో....
వేంపల్లె, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతుకు తీరని నష్టం జరిగింది. వేంపల్లె, కుమ్మరాపం పల్లె, ఇడుపులపాయ, అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాల్లో సాగులో ఉన్న వరి పంట నేలవా లింది. చేతికొచ్చిన పంట కళ్లముదే దెబ్బతిన డంతో లబోదిబోమంటున్నారు. నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Oct 16 , 2024 | 11:37 PM