Share News

మెడికవర్‌ ఆస్పత్రి ఇప్పుడు బెంగళూరులోనూ!

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:38 AM

అధునాతన సమగ్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో మెడికవర్‌ యాజమాన్యం కొత్తగా మరో ఆస్పత్రిని బెంగళూరులో బుధవారం ప్రారంభించింది.

మెడికవర్‌ ఆస్పత్రి ఇప్పుడు బెంగళూరులోనూ!

300 పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌

అధునాతన సౌకర్యాలు, అత్యాధునిక ల్యాబ్‌లు ప్రారంభించిన

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

రాబోయే 3-4 ఏళ్లల్లో అక్కడ మరో నాలుగైదు ఆస్పత్రులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి)ః అధునాతన సమగ్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో మెడికవర్‌ యాజమాన్యం కొత్తగా మరో ఆస్పత్రిని బెంగళూరులో బుధవారం ప్రారంభించింది. రూ.120 కోట్లతో రెండున్నర లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో, 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్డియాక్‌ సైన్స్‌, ఆర్థోపెడిక్స్‌, న్యూరో సైన్స్‌, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సైన్స్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షలకు సంబంధించిన అత్యాధునిక ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు మెడికవర్‌ యాజమాన్యం తెలిపింది. క్యాథ్‌ల్యాబ్‌, 3టీ ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, డిజిటల్‌ ఎక్స్‌రే లాంటి యంత్రపరికరాలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ఓపీ కోసం ప్రత్యేకంగా 45 రూమ్‌లను, వంద పడలకతో ఐసీయూ, ఎన్‌ఐసీయూ, పీఐసీయూ, కార్డియాక్‌ ఐసీయూ, ట్రాన్స్‌ప్లాంట్‌ ఐసీయూ, డే కేర్‌ సపోర్ట్‌, 24 గంటల ఎమర్జెన్సీ ట్రామాకేర్‌ సదుపాయం ఉన్నట్లు వెల్లడించింది.

తమ ఆస్పత్రిలో కాగితరహిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. తమ కార్యకలాపాల్లో సమగ్ర కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికతను వినియోగించనున్నట్లు పేర్కొంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో ఉన్న మెడికవర్‌ ఆస్పత్రులు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా అడుగుపెట్టాయి. బెంగళూరు నూతనంగా ఏర్పాటైన మెడికవర్‌ ఆస్పత్రిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కన్నడనాట వైద్యరంగంలో మెడికవర్‌ ఆస్పత్రులు రావడం గొప్పమార్పునకు సంకేతం అని, అన్ని రాష్ట్రాల్లో కలపి ఈ గ్రూపునకు 24 ఆస్పత్రులున్నాయన్నారు. మెడికవర్‌ యాజమాన్యానికి తమ ప్రభుత్వం నుంచి మద్దతు తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మెడికవర్‌ గ్రూపు ఆస్పత్రుల చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ కృష్ణ మాట్లాడారు. తమ గ్రూపు ఆస్పత్రుల్లో 14 వేల మంది నిపుణులు పనిజేస్తున్నారని, ఇందులో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారని, కొత్తగా బెంగళూరులో ఏర్పాటైన మెడికవర్‌లో మరో 1000 మంది వైద్య సిబ్బందికి ఉపాఽ ది లభించనుందని తెలిపారు. రాబోయే మూ డు నాలుగేళ్లలో బెంగళూరులో మరో4-5 నూ తన ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని, ఫలితంగా దేశవ్యాప్తంగా తమ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 6 వేలకు చేరుతుందని వెల్లడించారు.

Updated Date - Sep 26 , 2024 | 07:00 AM