ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ఓట్ల కోసం.. మరీ ఇంత నీచమా జగన్..?

ABN, Publish Date - May 03 , 2024 | 08:55 PM

వరుసగా రెండో సారి అధికారం అందుకోవడం కోసం వైసీపీ అంది వచ్చిన ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో పెన్షన్లు చేతికి అందక అధిక సంఖ్యలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ.. లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదును అధికారులు జమ చేశారు.

YS Jagan Mohan Reddy

విజయవాడ, మే 03: వరుసగా రెండో సారి అధికారం అందుకోవడం కోసం వైసీపీ అంది వచ్చిన ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో పెన్షన్లు చేతికి అందక అధిక సంఖ్యలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నికల వేళ.. లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదును అధికారులు జమ చేశారు.

Rohith Vemula: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత

ఆ క్రమంలో వారు బ్యాంకుల చుట్టూ మండుటెండల్లో తిరిగినా పెన్షన్ మాత్రం చేతికి రావడం లేదని వృద్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విజయవాడ మధురానగర్‌లోని ఓ వృద్ధురాలు పెన్షన్ కోసం బ్యాంక్‌కు వెళ్లి.. స్పృహ తప్పి సైడు కాలువలో పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను అధికార వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

LokSabha Elections: నాటి యూపీఏ దారిలో... నేటి దీదీ ప్రభుత్వం


దీనికంతటికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ ఆరోపించింది. అంతేకాదు ఈ విషయంలో చంద్రబాబును‌ బూచిగా చూపి అసత్యాలను సైతం ప్రచారం చేస్తుంది. చంద్రబాబు వల్లే వృద్దులకు ఈ అవస్థలంటూ ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ వివిధ సందర్బాల్లో పలు వేదికల మీద నుంచి ప్రకటిస్తు వస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ ట్రోల్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

LokSabha Elections: మొహువా మోయిత్రితో కలిసి స్టెపులు వేసిన దీదీ

లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడంలో ఈ జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు విమర్శిస్తున్నారు. వృద్ధులను ఉద్దేశ్య పూర్వకంగా ఇబ్బందులకు గురి చేసి.. ఓట్లు దండుకొనే ప్రయత్నంలో వైసీపీ చేస్తున్న దారుణాల్లో ఇది ఒకటి అని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబును బూచిగా చూపి వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తుందని నెటిజన్లు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు. అయినా అధికారంలోకి రావడం కోసం.. ఓట్లు కోసం.. ఇంత నీచమా? జగన్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

LokSabha Elections: మళ్లీ నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ.. స్పందించిన అన్నీ రాజా

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2024 | 08:55 PM

Advertising
Advertising