చెడ్డీగ్యాంగ్ కలవరం
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:40 AM
ఆలూరి నర్సింగ్ కళాశాలలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ కళాశాల కార్యాలయంలో రూ.లక్ష నగదు అపహరించుకెళ్లారు. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో అంతా బాలికలే ఉంటారు. దొంగలు కేవలం కళాశాల ఆఫీస్ గదులలో మాత్రమే దొంగతనానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వారు మారణ ఆయుధాలతో తిరుగుతుంటారు. అదేవిధంగా శివారు ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద భవనాలను ఎంపిక చేసుకుని చోరీలు చేశారు. అయితే ఈ ముఠా చోరీలకు పాల్పడే సమయంలో జనసంచారం ఉంటే వారిపై దాడులు చేయడానికి కూడా వెనుకాడరు
ట్రిపుల్ ఐటీలో చొరబాటు
నర్సింగ్ కాలేజీలో చోరీ
గస్తీ ముమ్మరం : డీఎస్పీ
గస్తీ ముమ్మరం: డీఎస్పీ
ఒంగోలు క్రైం, అక్టోబరు18 (ఆంధ్రజ్యోతి): చెడ్డీగ్యాంగ్ చొరబాటు విషయం నగరంలో కలవరం పుట్టిస్తోంది. పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం నగర శివారు ప్రాంతంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసిన అనే విషయం సీసీ పుటేజీలో వెలుగుచూసింది. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. రావ్ అండ్ నాయుడు కాలేజీలో ట్రిపుల్ ఐటీ నడుస్తుంది. అక్కడ రెండు వేలమంది విద్యార్థులు ఉంటున్నారు దొంగలు కాలేజీలోకి చొరబడి దొంగతనం చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. అక్కడ ఏమి వారికి దొరకలేదు. అక్కడి నుంచి రైలు పట్టాలు వెంట నడుచుకుంటూ రాంనగర్ 8 లైన్‌లో ఆలూరి నర్సింగ్ కళాశాలలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ కళాశాల కార్యాలయంలో రూ.లక్ష నగదు అపహరించుకెళ్లారు. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి అంతస్తులో బాలికల వసతిగృహం ఉంది. అదేవిధంగా నర్సింగ్ కళాశాలలో అంతా బాలికలే ఉంటారు. దొంగలు కేవలం కళాశాల ఆఫీస్ గదులలో మాత్రమే దొంగతనానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వారు మారణ ఆయుధాలతో తిరుగుతుంటారు. అదేవిధంగా శివారు ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద భవనాలను ఎంపిక చేసుకుని చోరీలు చేశారు. అయితే ఈ ముఠా చోరీలకు పాల్పడే సమయంలో జనసంచారం ఉంటే వారిపై దాడులు చేయడానికి కూడా వెనుకాడరు.
గస్తీ ముమ్మరం చేశాం: డీఎస్పీ
చెడ్డీగ్యాంగ్ కదలికలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఒంగోలు ట్రిపుల్ ఐటీ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో చోరీలకు పాల్పడినట్లు సీసీ ఫుటేజీ లభ్యమైందని చెప్పారు. ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాల మేరకు గస్తీ ముమ్మరం చేశామన్నారు. అదేవిధంగా బ్లూకోట్స్, రక్షక్ వ్యవస్థను పటిష్ట పరిచామని తెలిపారు. ఏడు బ్లూకోట్స్ బృందాలలో ఒక్కో వాహనంపై ఇరువురు ఉండే విధంగా రక్షక్ వాహనంలో డ్రైవర్‌తోపాటుగా ముగ్గురు సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. పోలీసు బీట్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ప్రతి కానిస్టేబుల్ వాహనానికి సైరన్ ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నిఘా పటిష్ట పరిచామని వివరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. అనుమానితులు ఉంటే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో, 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - Oct 20 , 2024 | 12:40 AM