గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:26 AM
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని వై.పాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.
పుల్లలచెరువు,అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని వై.పాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఆదివారం పుల్లలచెరువు మండలంలోని మర్రివేముల, ముటుకుల ,సింగుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని మర్రీవేములలో రూ.10 లక్షల, సింగుపల్లిలో రూ.10 లక్షలు, ముటుకులలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతముగా తీర్చిదిద్దేందుకు రూ.15 కోట్లతో సీసీ రోడ్లు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వసంతరావు నాయక్, ఏపీవో శ్రీనివాసరెడ్డి, పీఆర్ ఏఈ సుబ్బయ్య, టీడీపీ మండలాధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, టీడీపీ మండల నాయకులు కాకర్ల కోటయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, జనసేన మండలాధ్యక్షుడు కోటారి అచ్చయ్య ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : గ్రామాల అభివృద్ధి ఒక్క టీడీపీతోనే సాధ్యమని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని నడిగడ్డ, దూపాడు, గొల్లపల్లి, విశ్వనాథపురం, సోమేపల్లి, రాజు పాలెం, త్రిపురాంతకం గ్రామాలలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఆది వారం భూమిపూజ కార్యక్రమాలు చేశారు. కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన ఆయా రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా దోచుకోవడానికీ, దాచుకోవడానికే పనిచేసిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆద్వర్యంలో మరిన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపిస్తామని అన్నారు. కార్యక్రమాలలో ఎంపీడీవో రాజ్‌కుమార్, ఈవోపీఆర్‌డీ రామసుబ్బయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బేస్తవారపేట : రాష్ట్రంలో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేట మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారి నుంచి ఒంగోలు రోడ్డును వెడల్పు చేయడానికి నిధులు మంజూరు కావడంతో ఆదివారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేస్తవారపేటకు రూ.93 లక్షలకు సీసీ రోడ్లకు నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ రోడ్డు పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఐదేళ్లుగా, వైసీపీ ప్రభుత్వం ఎక్కడా సీసీరోడ్లు వేసిన దాఖలాలు లేవని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వేసిన రోడ్లు మాత్రమే గ్రామాల్లో కనిపిస్తున్నాయన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వంలో మారుమూల గ్రామాల సైతం సీసీరోడ్లు మంజూరు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఏవీ.రంగనాయకులు, తహసీల్దార్ జితేంద్ర, ఏఈ నాయక్, టీడీపీ మండల అధ్యక్షులు సోరెడ్డి మోహన్‌రెడ్డి, పూనూరు భూపాల్‌రెడ్డి, బుద్దుల ప్రేమానంద్, చెట్టిచెర్ల మాజీ సర్పంచ్ తిగిరెడ్డి భూపాల్‌రెడ్డి, దూదెకుల ఆదాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:26 AM