జీజీహెచ్‌లో మదర్ కేర్ సెంటర్
ABN, Publish Date - Nov 20 , 2024 | 01:14 AM
చిన్నారులకు బంగారు బాల్యాన్ని అందిం చేందుకు ఒంగోలులోని జీజీహెచ్‌లో త్వరలోనే ‘కంగారు’ మదర్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తా మని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం ఆమె ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులలో పర్యటించి రోగులతో మాట్లాడా రు. అక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.
త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ అన్సారియా వెల్లడి
ఆస్పత్రి సందర్శన
వార్డుల్లో పారిశుధ్యం అధ్వానంపై ఆగ్రహం
హెడ్ నర్సుకు చార్జ్‌మెమో
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 19 (ఆంధ్ర జ్యోతి): చిన్నారులకు బంగారు బాల్యాన్ని అందిం చేందుకు ఒంగోలులోని జీజీహెచ్‌లో త్వరలోనే ‘కంగారు’ మదర్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తా మని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం ఆమె ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులలో పర్యటించి రోగులతో మాట్లాడా రు. అక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ న్యూ బార్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కనిగిరి సీహెచ్‌సీలో కేఎంసీ పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పలుప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుతం జీజీహెచ్‌లోని గైనిక్, నవజాత శిశుకేంద్రాలను పరిశీలించామన్నారు. కేఎంసీ అంటే తన బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహజ సిద్ధమైన సంచిలో దాచి ప్రాణాలు కాపాడే కంగారు మాదిరిగా ఉంటుందన్నారు. నెలలు నిండకుండా పుట్టిన, బరువు తక్కువగా జన్మించిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలన్న ఆలోచనతోనే కంగారు మోడల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ ఉన్నారు.
పారిశుధ్యం అధ్వానంపై సీరియస్
జీజీహెచ్‌లో దాదాపు రెండు గంటలపాటు కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. అన్ని వార్డు లను పరిశీలించారు. వార్డుల్లో బాత్‌రూంలు అధ్వానంగా ఉండటంతోపాటు, దుర్వాసన రావ డంపై సీరియస్ అయ్యారు. బాధ్యతారాహి త్యంగా ఉన్న హెడ్ నర్సుకు చార్జ్ మెమో ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Updated Date - Nov 20 , 2024 | 01:14 AM