జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా
ABN, Publish Date - Jun 23 , 2024 | 01:37 AM
జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎ.తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. ఆమేరకు శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అల్లూరి జిల్లాకు దినేష్‌కుమార్ బదిలీ
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎ.తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. ఆమేరకు శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్సారియాకు కలెక్టర్‌గా ఇదే తొలి పోస్టింగ్. గతంలో ఆమె కొన్ని మునిసిపాలిటీల్లో కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తమీమ్ అన్సారియా కేరళ రాష్ట్రానికి చెందిన వారని తెలిసింది. ఆమె భర్త కూడా ఐఏఎస్ అధికారి. ఇద్దరూ ఏపీ పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త శ్రీకాకుళం కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను బదిలీ చేయలేదని తెలిసింది. ఎన్నికలకు కొద్దికాలం ముందుగానే అన్సారియా శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అన్సారియాను మన జిల్లాకు 38వ కలెక్టర్‌గా నియమించారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేసుకు వెళ్లే అధికారిగా ఆమెకు పేరుంది. మితభాషి అని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇక్కడ కలెక్టర్‌గా ఉన్న దినేష్‌కుమార్‌ను గిరిజన ప్రాంతాలతో ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. తమిళనాడుకు చెందిన దినేష్‌కుమార్‌కు కూడా కలెక్టర్‌గా మన జిల్లాలోనే తొలి పోస్టింగ్ ఇవ్వగా రెండేళ్లు పనిచేశారు. అధికారపార్టీ నేతలతో సమన్వయంగా పనిచేయడంలో సఫలీకృతులయ్యారు. ఒకదశలో ఆయనకు మళ్లీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇవ్వకపోవచ్చని భావించారు. కానీ వివిధ కోణాల్లో పరిశీలించిన అనంతరం ఆయన్ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా నియమించినట్లు తెలిసింది.
Updated Date - Jun 23 , 2024 | 01:37 AM