తురకపాలెం పంచాయతీకి ఇద్దరు కార్యదర్శులు
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:30 PM
మండలంలోని తురకపాలెం గ్రామ పంచాయతీకి ఇద్దరు కార్యదర్శులు ఉండటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి గా వద్ది కోటేశ్వరరావు విధుల్లో ఉన్నారు.
తాళ్లూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తురకపాలెం గ్రామ పంచాయతీకి ఇద్దరు కార్యదర్శులు ఉండటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి గా వద్ది కోటేశ్వరరావు విధుల్లో ఉన్నారు. ఇతనిని బదిలీ చేయకుండాలనే చీరాల మండలం ఈపూరుపాలెం పంచాయతీ కార్యదర్శి షేక్ రబ్బానీఅహ్మద్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు రబ్బానీహ్మద్‌ను తురకపాలెంకు నియమించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మిద్వారా సిఫార్సు లేక పంపారు.
అయితే, కోటేశ్వరరావు ఇక్కడే ఉంటానని చెప్పటంతో అధికారపార్టీ నేతలు జిల్లా అధికారులను కలిసి అతనినే కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. అధికారపార్టీ నేతల సిఫార్సులేఖ మేరకు జిల్లాపంచాయతీ అధికారులు షేక్ రబ్బాని అహ్మద్‌ను తురకపాలెం పంచాయతీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈయన ఈనెల 7 వ తేదీ ఈపూరుపాలెం-2 నుంచి రిలీవ్ అయ్యారు. తురకపాలెంలో విధుల్లో చేరేందుకు వెళ్లగా అక్కడి పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయకపోవటంతో సమస్యగా మారింది. అధికార టీడీపీ నేతల దృష్టికి సమస్య వెళ్లినా అదిగో, ఇదిగో మార్పు చేయిస్తామంటూ మీన మేషాలు లెక్కిస్తున్నారు. పదిరోజుల పాటు వేచిచూసిన పంచాయతీ కార్యదర్శి రబ్బానీ తాను జిల్లా అధికారుల ఆర్డర్ మేరకు రిలీవ్ అయినందున విధుల్లో చేర్చుకోవాలని ఎంపీపీవో కె.సుందరరామయ్యను కలిసి విన్నవించారు.
మూడురోజుల క్రితం పల్లెపండుగ కు మాధవరం గ్రామానికి వచ్చిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్‌సాగర్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఉన్నతాధికారులు కూడా ఉన్న పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేసి కొత్తవారిని నియమించాలన్న ని బంధనలకు తిలోదకాలు ఇచ్చారు. విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయకుండానే మరొకరిని నియమించటం చ ర్చనీయాంశమైంది.
Updated Date - Oct 20 , 2024 | 10:30 PM