ఉచిత బస్సు ప్రయాణం కల్పించండి
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:56 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ అన్నారు.
డీసీసీ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ
కర్నూలు, అర్బన, అక్టోబరు 19,(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ అన్నారు. ఆదివారం సిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పోస్టు కార్డులపై సంతకాలు చేసి సీఎం, చంద్రబాబుకు పంపారు. కొత్త బస్టాండ్ నుంచి బస్సు ప్రయాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక రాషా్ట్రల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా మహిళలకు బస్సు ప్రయాణం ఎందుకు కల్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, రోజు మహిళల ద్వారా రూ.7.10 కోట్లు, నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తోందని దాటవేస్తున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం, కీలకమైందని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎ.వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన, కరుణమ్మ, అబ్దుల్ హై తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 10:56 PM