ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిక్ష.. ఒక హెచ్చరికలా ఉండాలి!

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:24 AM

కడప జిల్లా బద్వేల్‌లో ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

బద్వేల్‌ ఘటనపై అధికారులకు సీఎం సూచన

ఇంటర్‌ విద్యార్థిని మృతిపై చంద్రబాబు విచారం

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరపాలని ఆదేశం

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా బద్వేల్‌లో ఇంటర్‌ విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించి, ఆమె మరణానికి కారణమైన నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యార్థిని మృతిపై ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా సీఎం విచారం వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఎంతో భవిష్యత్‌ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలైపోయింది. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించాను. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే హంతకుడిని త్వరగా, చట్టబద్ధంగా, కఠినంగా శిక్షించడమే. అందుకు ప్రత్యేక కోర్టులో ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను’ అని సీఎం వెల్లడించారు. కాగా, విద్యార్థిని మృతిపై బీసీ సంక్షేమశాఖ మంత్రి, కడప ఇన్‌చార్జ్‌ మంత్రి సవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 03:24 AM