Share News

యువత ఓటును నమోదు చేసుకోండి

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:18 AM

వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న యువత ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో తమ ఓటును నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా తెలిపారు.

యువత ఓటును నమోదు చేసుకోండి
పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ పి .రంజిత బాషా

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న యువత ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో తమ ఓటును నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా తెలిపారు. శనివారం స్పెషల్‌ సమ్మరి రివిజన-2025లో భాగంగా కర్నూలు అర్బన పరిధిలోని స్థానిక ఎస్టీబీసీ కళాశాలలోని 35, 36, 37, 38, 39, 40 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్పెషల్‌ క్యాంపెయిన డే (ప్రత్యేక ఓటరు నమోదు) కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితా-2025లో భాగంగా అక్టోబరు 29 నుంచి నవంబరు 28వ తేదీ వరకు తాత్కాలిక షిప్ట్‌, శాశ్వత షిఫ్ట్‌, డెత ఓటర్లకు సంబంధించి వచ్చిన క్లెయిమ్స్‌ను డిసెంబరు 24లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని బూత స్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, కర్నూలు అర్బన తహసీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎస్టీబీసీ కలాశాల ప్రిన్సిపాల్‌ డా.ఆర్‌.ప్రశాంతిసామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:18 AM