Share News

YS Sharmila: అవి పచ్చి అబద్ధాలు.. జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:55 PM

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు.

YS Sharmila: అవి పచ్చి అబద్ధాలు.. జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

అమరావతి: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తన మీద ప్రేమతో, చట్ట విరుద్ధమని తెలిసినా షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు కోసమే ఇదంతా తాము చేస్తున్నామనడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా షర్మిల అభివర్ణించారు.

"చట్ట విరుద్ధమని తెలిసినా.. చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధం. ఆయన బెయిల్ రద్దు చేసేందుకు మేం కుట్రపన్నాం అనేది ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్. ఆస్తుల మీద ఉన్న ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారు. అందుకే ఇప్పుడు మీకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారు. ఆస్తులను లాక్కునేందుకు.. ఈడీ కేసులని, తన బెయిల్ రద్దవుతుందని ఏవేవో కారణాలు చెబుతున్నారు. స‌ర‌స్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు.

ఈడీ కేవలం రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసింది. కంపెనీ షేర్ల వరకు రాలేదు. ఏ స‌మ‌యంలోనైనా వాటిని బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఏ కంపెనీ ఆస్తుల‌నైనా ఈడీ అటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బ‌దిలీని మాత్రం ఎప్పుడూ ఆప‌లేదు. స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీలకు సంబంధించి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. అయినా వాటి ట్రేడింగ్ అవుతోంది. షేర్లు కూడా బదిలీ అవుతున్నాయి. 2016లో ఈడీ అటాచ్ చేసినందువ‌ల్ల షేర్ల బ‌దిలీ చేయకూడదని జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వాదిస్తున్నారు. అలా చేస్తే బెయిల్ రద్దు అవుతుందని బీద ఏడ్పులు ఏడుస్తున్నారు" అని షర్మిల విమర్శించారు.


అప్పుడు బెయిల్ గుర్తు రాలేదా?

"1. 2019లో షర్మిలకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU పై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?

2. 2021లో క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్ విజ‌య‌ ఎలా అనుమతి ఇచ్చారు. అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?

3. 2021లో తన భార్య షేర్లపై సంతకం చేసి, వైఎస్ విజ‌య‌కు ఫోలియో నంబర్లతో పాటు గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?

వాస్తవం ఏంటంటే మొన్నటి ఏపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేక‌, భారతి సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్‌ను నిర్వహించాలనుకున్నారు. అందుకే ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ అంశాన్ని లేవనెత్తారు. షేర్లను బదిలీ చేయలేమని చెబుతున్నారు. అయితే ఈడీ అటాచ్ చేసింది కంపెనీ భూమి మాత్రమే. షేర్లు కాదు. వాటిని బదిలి చేయవచ్చు"అని షర్మిల పేర్కొన్నారు.

Diwali 2024: దీపావళి పరమార్థం తెలుసా.. పండుగ 5 రోజులెందుకు

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా


For Latest News and National News click here...

Updated Date - Oct 25 , 2024 | 08:45 AM