ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్

ABN, Publish Date - Oct 01 , 2024 | 05:23 PM

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇవాళ (మంగళవారం) ప్రకటించారు. slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని అభ్యర్థులకు ఆమె సూచించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇవాళ (మంగళవారం) ప్రకటించారు. slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని అభ్యర్థులకు ఆమె సూచించారు. రకరకాల కారణాలతో నిలిచిన ఎంపిక ప్రక్రియకు కూటమి ప్రభుత్వ చొరవతో మోక్షం లభించనుందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టడంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు.


5 నెలల్లో పూర్తి

6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలను 5 నెలల్లోగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టంగా ప్రకటించారు. 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు ఇతర కారణాలతో పరీక్షలు వాయిదాపడ్డాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580, కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వాయిదా పడింది.


కాగా ప్రిలిమినరీ రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా వారిలో 382 మంది మాత్రమే అర్హత సాధించారు. అర్హత సాధించినవారిలో 100 మంది హోంగార్డులు హైకోర్టులో 14 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని, తద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసింది.


ఈ విషయం కూటమి ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయ సలహా తీసుకొని, ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండవ దశను (PMT/PET) వెంటనే పున: కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించార. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష (Final Written Exam) జరుగుతుందని ఆమె వివరించారు.


ఇవి కూడా చదవండి

పిఠాపురంలో దారుణం.. వృద్ధురాలు పింఛను తీసుకొని

తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తులో కీలక పరిణామం

Updated Date - Oct 01 , 2024 | 05:44 PM