ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దక్షిణ మధ్య రైల్వేకు రూ.25 వేల జరిమానా

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:40 AM

రైలులో తగినంత నీరు, ఏసీ సదుపాయం కల్పించలేదని దక్షిణ మధ్య రైల్వేకు వినియోగదారుల కమిషన్‌ రూ.25 వేల జరిమానా విధించింది.

ఏసీ, నీరు తగినంత లేదని ప్రయాణికుడి ఫిర్యాదు

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రైలులో తగినంత నీరు, ఏసీ సదుపాయం కల్పించలేదని దక్షిణ మధ్య రైల్వేకు వినియోగదారుల కమిషన్‌ రూ.25 వేల జరిమానా విధించింది. విశాఖపట్నానికి చెందిన మూర్తి తన కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లడానికి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలులో థర్డ్‌ ఏసీ టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. ఆయన ఈ ఏడాది జూన్‌ 5న విశాఖపట్నం నుంచి రైలు కదిలే ముందు ఆయన సీట్లు 3ఏ కోచ్‌ నుంచి 3ఈ కోచ్‌కు మార్చినట్టు అధికారులు తెలిపారు. టాయిలెట్లలో తగినంత నీరు రాకపోవడం, ఏసీ కోచ్‌లో ఏసీ తక్కువగా ఉండడం, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఆయన దువ్వాడ స్టేషన్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు పెద్దగా స్పందించలేదు. దాంతో మూర్తి వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో పైపుల్లో ఎయిర్‌ బ్లాక్‌ కావడం వల్ల నీరు తగినంత రాలేదని అధికారులు వివరించారు. రైలులో సౌకర్యవంతమైన ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉందని, ఫిర్యాదు చేసినా స్పందించనందున ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారంతో పాటు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు కలిపి రూ.30 వేలు చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది.

Updated Date - Oct 31 , 2024 | 03:40 AM