రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
ABN, Publish Date - Jun 09 , 2024 | 11:51 PM
జాతీయ రహదారి పలాస బైపాస్ కంబిరిగాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అర్చకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
పలాస: జాతీయ రహదారి పలాస బైపాస్ కంబిరిగాం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అర్చకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేట మండలం రామయ్యపట్నం గ్రామానికి చెం దిన రమేష్‌కుమార్ పాణిగ్రాహి (45) అనే అర్చకుడు మృతి చెందాడు. ఈయన టెక్కలి మీదుగా స్వగ్రామానికి ద్విచక్ర వాహనం వెళ్తుండగా అదుపుతప్పి ఫ్లైఓవర్ రక్షణ గోడకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామ ఆలయ అర్చకుడిగా పాణిగ్రాహి జీవనం పొందుగున్నాడు. ఈయనకు భార్య ప్రత్యూష ఉన్నారు. ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీ ఢీకొని యువకుడు..
ఎచ్చెర్ల: కుశాలపురం సమీపం నవభారత్ వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లావేరు మండలం బెజ్జిపురం పంచాయతీ వెంకటరావుపేట గ్రామానికి చెందిన పిన్నింటి రామ్‌కుమార్(32) ఓ కేబుల్ ఆపరేటర్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం విధులు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా నవభారత్ జంక్షన్ సమీపంలో ఆగి ఉన్న లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. రామ్‌కుమార్‌కు తల్లిదండ్రులు అప్పారావు, కళావతి ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jun 09 , 2024 | 11:51 PM